మంత్రి కేటీఆర్ జగిత్యాల పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి జాతీయ రహదారిపై అప్పుడే ఓ ప్రమాదం జరిగింది. ఓ యువకుడు రక్త గాయాలతో స్పృహకోల్పోయాడు. అంబులెన్స్ కి ఫోన్ చేసినా ఇంకా రాలేదు. ఈలోపు బాధితుడికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తన కాన్వాయ్ లోని వాహనంలో అతడిని ఆస్పత్రికి తరలించారు మంత్రి కేటీఆర్.
మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రమాద స్థలానికి రావడం, యువకుడి పరిస్థితి ఆరా తీయడం, వాహనంలో అతడిని తరలించడం.. ఈ మొత్తం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి కేటీఆర్ ఔదార్యాన్ని నెటిజన్లు అభినందించారు. గతంలో కూడా ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్ ఆపి మరీ వారిని పరామర్శించారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు సాయపడ్డారు. బాధితుడి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్టు చెప్పారు.
మానవత్వం చాటుకున్న మంత్రి వర్యులు శ్రీ @KTRBRS గారు..!!
ఈరోజు జగిత్యాల పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదం లో గాయపడిన వారిని తన కాన్వాయ్ లో హాస్పిటల్ కు తరలించారు…@KTRBRS #ktr… pic.twitter.com/GTscFrEVrz
— Pochampally Srinivas Reddy (@PSReddyTRS) July 16, 2023