Site icon HashtagU Telugu

KTR Davos : తెలంగాణ‌కు మ‌రో ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ.. దావోస్‌లో కేటీఆర్ ఒప్పందం

Davos Ktr

Davos Ktr

స్విట్జ‌ర్లాండ్‌లోని జూరిచ్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న బీమా సంస్థ స్విస్ రే ఆగ‌స్టులో త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌నుంది. 160 క్రితం ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన ఈ సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా 80 దేశాల్లో కార్య‌క‌లాపాలు సాగిస్తోంది. హైద‌రాబాద్‌లో త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసేలా ఆ సంస్థ ప్ర‌తినిధులు సోమ‌వారం కేటీఆర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. పెట్టుబ‌డులు రాబ‌ట్ట‌డంలో ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స‌త్తా చాటుతున్నారు. దావోస్‌లో ఆదివారం ప్రారంభమైన వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సుకు తెలంగాణ త‌ర‌ఫున హాజ‌రైన ఆయ‌న , రెండో రోజే ఓ అంత‌ర్జాతీయ బీమా సంస్థ‌ను తెలంగాణ‌కు ర‌ప్పిస్తూ కీల‌క ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విష‌యాన్ని కేటీఆర్ సోమ‌వారం సాయంత్రం స్వ‌యంగా ప్ర‌క‌టించారు.