రజనీకాంత్ కు తెలంగాణ అభివృద్ధి కనిపిస్తోంది కానీ ప్రతిపక్ష నేతలకు కనిపించటం లేదు – మంత్రి కేటీఆర్

తాను న్యూయార్క్‌లో ఉన్నానా? హైదరాబాద్‌లో ఉన్నానో తెలియడం లేదన్నారు

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 11:29 AM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) వాడివేడిగా నడుస్తున్నాయి.రెండోరోజు ప్రశ్నోత్తరాలపై చర్చ నడుస్తుంది. ఈ సందర్భంగా సభలో కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఫై నిప్పులు పూసుకుంటున్నారు..కేసీఆర్ పాలనా లో తెలంగాణ అభివృద్ధి జరగలేదని అంటున్నారు. అసలు ఆలా ఎలా మాట్లాడబుద్ది అవుతుందని ప్రశ్నించారు.

రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ (Hyderabad) వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్.. తాను న్యూయార్క్‌లో ఉన్నానా? హైదరాబాద్‌లో ఉన్నానో తెలియడం లేదన్నారు. సూపర్ స్టార్ రజినీ కాంత్‌కు తెలంగాణ అభివృద్ధి కనిపిస్తోంది కానీ ప్రతిపక్ష నేతలకు కనిపించటం లేదు. ప్రతిపక్ష నేతలు కంటి వెలుగులో చూపించుకుంటే మంచిది’’ అని సైటైర్ వేశారు మంత్రి. అలాగే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ను కూడా వదలకుండా సెటైర్లు వేశారు. రాజేందర్ (Etela Rajender) మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్‌లో ఐటీ కంపెనీ ఉండేదని.. ఇప్పుడు ఉందో లేదో తెలియదన్నారు. దీనికి ఈటల లేదని సమాధానం చెప్పారు. ‘నువ్వు బీజేపీలోకి వెళ్ళావు.. ఐటీ కంపెనీ మూత పడింది’ అని ఎద్దేవా చేసారు. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూకుంభకోణాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ రోజు ఎకరం భూమి ధర రూ.100 కోట్లకు రికార్డు స్థాయిలో పెరిగిందంటే ఆషామాషీ కాదన్నారు.

తెలంగాణ‌లో మ‌తాల పంచాయ‌తీ లేదు, కులాల మ‌ధ్య కొట్లాట లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ద‌క్ష‌త క‌లిగిన ద‌మ్మున్న నాయ‌కుడు కేసీఆర్ ఉండ‌టం వ‌ల్లే అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. దేశంలో ఉన్న‌ ఐటీ పురోగ‌తితో పోలిస్తే.. మ‌న ఐటీ పురోగ‌తి నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉంది. స్టేబుల్ గ‌వ‌ర్న‌మెంట్.. ఏబుల్ లీడ‌ర్‌షిప్ వ‌ల్లే ఇదంతా సాధ్యం అయింద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. గురుగ్రామ్‌లో ఐటీ ప‌రిశ్ర‌మ‌ను నాశ‌నం చేస్తున్నారు. మ‌ణిపూర్‌లో తెగ‌ల మ‌ధ్య కొట్లాట పెట్టారు అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కు.. 27 సంవ‌త్స‌రాల్లో ఐటీ రంగాల్లో రూ. 56 వేల కోట్లు ఐటీ ఎగుమ‌తులు మాత్ర‌మే. కానీ గ‌తేడాది తెలంగాణ ప్ర‌భుత్వం ఐటీ రంగంలో రూ. 57,707 ఐటీ ఎగుమ‌తులు సాధించింది. ఇది స‌మ‌ర్థ‌త గ‌ల ప్ర‌భుత్వంతోనే సాధ్యమైందన్నారు.

Read Also : Heaviest Animal: ప్రపంచంలోనే అత్యంత బరువైన జంతువు ఇదే..! బరువు ఎంతంటే..?