Site icon HashtagU Telugu

KTR Tweet : మీ కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు బీఆర్ఎస్ సైన్యం భయపడదు – కేటీఆర్

HYDRA victims should be given double bedroom houses: KTR demands to Govt

HYDRA victims should be given double bedroom houses: KTR demands to Govt

తెలంగాణ (Telangana) లో మరోసారి రాజకీయాలు (Politics) వేడెక్కాయి. మొన్నటి వరకు ఓ లెక్క..ఈరోజు నుండి మరో లెక్క అంటున్నారు బిఆర్ఎస్ నేతలు. గురువారం ఉదయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Attack on Pahadi Kaushik Reddy) ఇంటిపై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (Arekapudi Gandhi) తన అనుచరులతో వెళ్లి దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది.
ఈ దాడి వ్యతిరేకిస్తూ..బిఆర్ఎస్ నేతలు గాంధీ ఫై పిర్యాదు చేసేందుకు సీపీ ఆఫీస్ కు వెళ్తే..గాంధీ పై fir నమోదు చేయకపోగా..బిఆర్ఎస్ నేతలనే అరెస్ట్ చేసి రెండు గంటలుగా బస్సు లో తిప్పుతున్నారు. ఈ ఘటన పై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైతులు సైతం బిఆర్ఎస్ కు సపోర్ట్ గా నిలుస్తుండడం తో బిఆర్ఎస్ నేతలు ఇక తగ్గేదేలే అంటున్నారు.

ఇటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలుస్తున్నారు. రేవంత్.. మీ పాలన నుంచి తెలంగాణను కాపాడుకుంటాం అంటూ ట్వీట్ చేసారు. ‘మీరు గూండాయిజం, దౌర్జన్యం చేసినా.. మీ కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు బీఆర్ఎస్ సైన్యం భయపడదు. మీ అవినీతి పాలన నుంచి తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాం. మీరు చేసే ప్రతి బెదిరింపు మా నిర్ణయాన్ని మరింత బలంగా మారుస్తుంది. కౌశిక్ రెడ్డి బలంగా నిలబడండి. ప్రజలు, మేము మీ వెంటే ఉన్నాం’ అని పేర్కొన్నారు.

Read Also : Telangana govt : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట