KTR Fire: అది జనజాతర సభ కాదు.. హామీల పాతర, అబద్ధాల జాతర సభ: KTR

తుక్కుగూడ‌లో కాంగ్రెస్ నిర్వ‌హించిన జ‌న జాత‌ర స‌భ‌ను ఉద్దేశించి కేటీఆర్ విమ‌ర్శ‌లు (KTR Fire) చేశారు. ట్వీట్ట‌ర్ వేదిక ఈ విమ‌ర్శ‌లు చేశారు. అది జనజాతర సభ కాదు.. హామీల పాతర... అబద్ధాల జాతర సభ అని అన్నారు.

Published By: HashtagU Telugu Desk
KTR Tweet

KTR interesting tweet on the party changing leaders

KTR Fire: తుక్కుగూడ‌లో కాంగ్రెస్ నిర్వ‌హించిన జ‌న జాత‌ర స‌భ‌ను ఉద్దేశించి కేటీఆర్ విమ‌ర్శ‌లు (KTR Fire) చేశారు. ట్వీట్ట‌ర్ వేదిక ఈ విమ‌ర్శ‌లు చేశారు. అది జనజాతర సభ కాదు.. హామీల పాతర… అబద్ధాల జాతర సభ అని అన్నారు. రాహుల్ గాంధీ గారు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..! పార్లమెంట్ ఎలక్షన్లలో.. న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..? అని ప్ర‌శ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు?? అని పేర్కొన్నారు.

నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా కాంగ్రెస్‌ నయవంచన చేస్తోందన్నారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చి.. అన్నదాతలను ఆత్మహత్యల పాల్జేస్తోంది.. నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోంది.. గ్యారెంటీలకు పాతరేసి… అసత్యాలతో జాతర చేస్తోందన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని మండిప‌డ్డారు.

Also Read: Pawan Varahi Yatra: అనకాపల్లిలో ఈ రోజు పవన్ పర్యటన

కాంగ్రెస్ అసమర్థ పాలనలో.. సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారు. మీ మోసాలపై మహిళలు మండిపడుతున్నారు. రాహుల్ గారు.. మా అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా..? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా ? 200కిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా ? చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా ? డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా ? అని ప్ర‌శ్న‌లు వేశారు.

75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే.. కాంగ్రెస్. కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు. చేతి గుర్తుకు ఓటేస్తే.. చేతులెత్తేయడం ఖాయమని..
తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు. సకల రంగాలను సంక్షోభంలోకి నెట్టిన.. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే నిండా మునగడం ఖాయమని తేలిపోయింది. అందుకే.. వందరోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం ఖాయమ‌ని ఆయ‌న అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 07 Apr 2024, 10:14 AM IST