KTR Gift: నాన్నకు ప్రేమతో… కేటీఆర్ గిఫ్ట్

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని పలువురు అభిమానులు, విదేశాల్లో టిఆర్ఎస్ మద్దతుదారులు ఘనంగా జరుపుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ktr Vehicle Imresizer

Ktr Vehicle Imresizer

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని పలువురు అభిమానులు, విదేశాల్లో టిఆర్ఎస్ మద్దతుదారులు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
కేసీఆర్ పుట్టినరోజులో భాగంగా మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో వికలాంగులకు 300 కస్టమ్ మేడ్ వాహనాలను పంపిణీ చేశారు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నందున ప్రజలకు ఏదైనా చేయాలని భావించి గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని, వంద కస్టమ్ మేడ్ వాహనాలను అందించడం ద్వారా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు వెళ్లి చాలామంది నిస్సహాయిలను ఆసరాగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు 850 కస్టమ్ మేడ్ వాహనాలను ప్రజాప్రతినిధులు విరాళంగా ఇచ్చారని, మరో 250 వాహనాలు త్వరలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని వాహనాలు అందించిన నాయకులందరికీ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వాహనాలు దివ్యాంగులు తిరిగేందుకు దోహదపడటమే కాకుండా ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లేందుకు, వ్యాపారాలు చేసుకునేందుకు, జీవనోపాధి పొందేందుకు కూడా అవకాశం కల్పిస్తాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వికలాంగులకు గుజరాత్ రాష్ట్రం రూ.600 నుంచి రూ.1000 పింఛన్ ఇస్తోందని, మధ్యప్రదేశ్ రూ.300, ఉత్తరప్రదేశ్ రూ.1000 ఇస్తోందని, అందరికంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం రూ.3016 పింఛన్ ఇస్తున్నది అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి వికలాంగుడిని ఆదుకుంటుందని కేటీఆర్ తెలిపారు.

https://twitter.com/trspartyonline/status/1494285208140468227

 

  Last Updated: 17 Feb 2022, 10:20 PM IST