KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేయడాన్ని ట్విటర్ వేదికగా ఆక్షేపించారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా? లేదంటే ఏఐసీసీకి ఏదో ప్రత్యేక కారణం ఉందా? అంటూ ప్రశ్నలు సంధించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటనను తప్పుబట్టిన కేటీఆర్, “రాష్ట్ర రైతులను జైలుకు పంపినందుకు, భూములు బలవంతంగా గుంజుకున్నందుకు, రైతులను కొనుగోలు కేంద్రాల్లో అవమానించినందుకు, ఏఐసీసీకి అంత సంతృప్తి వచ్చిందా?” అని విరుచుకుపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరుతో వేల ఇళ్లను కూల్చివేయడంపై మండిపడిన కేటీఆర్, పేద ప్రజలను హైడ్రా పేరిట భయపెట్టడమే మీ పాలనలో ముఖ్య కార్యక్రమమా? అని నిలదీశారు. “ఏడాది దాటిపోయింది గానీ, గ్యారెంటీ కార్డులు పాతాళానికి పోయాయి. రెండు లక్షల ఉద్యోగాల హామీ గాలిలో కలిసిపోయింది.
Arvind Kejriwal : కైలాష్ గెహ్లాట్ రాజీనామాపై స్పందించిన కేజ్రీవాల్
సంక్షేమాన్ని సమాధి చేసి, అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేయడం మీ పాలన ప్రథమ లక్ష్యమా?” అని విమర్శించారు. తెలంగాణ రైతులను, పేదలను, వివిధ వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ పాలనకు ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో అన్నివర్గాలను ద్రోహం చేసిన కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, దీనిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎలా సంతృప్తితో సమర్థిస్తోందని ప్రశ్నించారు. “నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ ఈ అవినీతి, నిర్లక్ష్య పాలనపై రగిలిపోతున్నారు. మీ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం ఆగిపోయింది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీపై ప్రత్యేకంగా విమర్శలు చేసిన కేటీఆర్, “మీరు ఎన్నికల హామీగా 100 రోజుల్లో తెలంగాణ మహిళలకు నెలకు రూ. 2,500 ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదు. ఇప్పటికి 350 రోజులు దాటిపోయాయి. రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది మహిళలు మీ హామీ నెరవేర్చాలని ఎదురు చూస్తున్నారు. మాటలు చెప్పడం తప్ప హామీలను నెరవేర్చడంలో మీకు చిత్తశుద్ధి ఉందా?” అని నిలదీశారు. కేటీఆర్ ట్వీట్లలో, తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజాసంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని, ఇది ప్రజల ద్రోహానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. “మీ వాగ్దాన విఫలతలతో మీరు విసిగిపోలేదా? ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందా?” అంటూ తన ట్వీట్స్‌ను ముగించారు.
Dhanush VS Heroine Nayanatara : మీరు మారండి ..అంటూ ధనుష్ ను ఉద్దేశించి విఘ్నేశ్ ట్వీట్..