KTR Satire: కిషన్ రెడ్డికి కంగ్రాట్స్…అంటూనే కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు..!!

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ను గుజరాత్ లోని జామ్ నగర్ కు తరలించడంపట్ల మండిపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Ktr Kishen Reddy

Ktr Kishen Reddy

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ను గుజరాత్ లోని జామ్ నగర్ కు తరలించడంపట్ల మండిపడ్డారు. గతంలో దానిని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ ను ఉటంకిస్తూ ఆయన వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థున రాష్ట్రానికి తీసుకువచ్చినందుకు NPA ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి జీకి అభినందనలు…కాస్త ఆగండి..ఎప్పటిలాగే, గుజరాత్ ప్రధానమంత్రి దానిని జామ్ నగర్ కు తరలించేందుకు నిర్ణయించుకున్నారు. తెలంగాణపై మోదీజీ వివక్ష నిరంతరం కొనసాగుతూనే ఉదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ వివక్షను అక్షర రూపంలో ట్విట్టర్ లో పెట్టారు మంత్రి కేటీఆర్.

ఇక దేశవ్యాప్తంగా కేంద్రం…7ఐఐటీలు, 2 ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, 16త్రిబుల్ ఐటీలు, 4 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, 157 వైద్య కాలేజీలు, 84 నవోదయ విద్యాలయాలు కేటాయించినా…తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీలు ఇస్తామన హామీ ఇచ్చినా..ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదని ఘాటుగా విమర్శించారు.

  Last Updated: 21 Apr 2022, 03:44 PM IST