Site icon HashtagU Telugu

KTR Tribute: కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల కేటీఆర్ సంతాపం

1112414 Ktr News

1112414 Ktr News

KTR Tribute: మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్వర్ రెడ్డి పరిగి ప్రాంతానికి ఎంతగానో సేవలు అందించారన్నారు. హరీశ్వర్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని కేటీఆర్ ప్రార్థించారు. హరీశ్వర్ రెడ్డి కుమారుడు, ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మహేష్ రెడ్డికి ఆయన కుటుంబానికి తన సంతాపం తెలిపారు.