తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం నివహించిన ఈ సమావేశంలో ఇళ్ల స్థలాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది.హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
58, 59 జీఓ కింద క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న వాటి పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ విషయంలో మరింత కసరత్తు చేశాక సీఎం కేసీఆర్కు నివేదిక అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
