Paddy Issue: ఇది అన్నదాత పోరాటమే కాదు… తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం – ‘కేటీఆర్’

ప్రస్తుతం తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం అన్నది ఎంత హాట్ టాపిక్ గా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం.

  • Written By:
  • Publish Date - April 9, 2022 / 06:58 PM IST

ప్రస్తుతం తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం అన్నది ఎంత హాట్ టాపిక్ గా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఇదే విషయమై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై ఇది కేవ‌లం అన్న‌దాత పోరాటం మాత్ర‌మే కాద‌ని, ఇది తెలంగాణ ఆత్మ‌గౌర‌వ పోరాట‌మ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో పండిన వ‌రి ధాన్యాన్ని కొనేదాకా కేంద్రాన్ని వ‌దిలేదే లేద‌న్నారు.

తెలంగాణ బీజేపీ నాయ‌కులు రైతుల‌ను రెచ్చ‌గొట్టి, వ‌రి వేయించార‌ని… ఇప్పుడు యాసంగి ధాన్యం కొనబోమంటూ కేంద్రం నాట‌కాలు ఆడుతోందంటూ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. యాసంగి వ‌డ్ల కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేద‌ని రాష్ట్ర రైతుల‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే సూచించార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ, కేంద్రంతో వ‌డ్లు కొనిపించే బాధ్య‌త త‌మ‌దేన‌ని చెప్పి, రైతుల‌తో గ‌ల్లీ బీజేపీ నాయ‌కులు వ‌రి వేయించార‌ని ఆయన మండిప‌డ్డారు. ఇప్పుడు ఆ ధాన్యాన్ని కొన‌బోమ‌ని ఢిల్లీ బీజేపీ మొండికేస్తోంద‌ని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల‌ను ఆగంజేసిన బీజేపీ నాయ‌కుల‌ను త‌రిమికొట్టాల‌ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.