Site icon HashtagU Telugu

KTR:బండి సంజయ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు.?

Ktr Bandi

Ktr Bandi

ఓ వర్గాన్ని కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆమెకు వంతపాడిన నవీన్ కుమార్ జిందాల్ పై కూడా పార్టీ వేటు వేసింది. వీరి వ్యాఖ్యలతో యూపీలోని కాన్పుర్ లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో…వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది.

ఈనేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ నిజంగానే అన్నిమతాలను గౌరవించినట్లయితే…అన్ని మసీదులను తవ్వి..ఉర్ధూపై నిషేధం విధించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ఈ ప్రశ్నను సంధించారు. ఈ సెలక్టివ్ ట్రీట్ మెంట్ ఎందుకు దీనిపై క్లారిటీ ఇవ్వండి..అని నిలదీశారు .కాగా హిందూ ఏక్తా కార్యక్రమంలో బండి సంజయ్…తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వాలని ఓవైసీకి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. శవాలు వస్తే మీకు…లింగాలు వస్తే మాకు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.