KTR In UK: లండన్ లో కేటీఆర్ కు ఘనస్వాగతం!

గ్లోబల్ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం లండన్ చేరుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ktr Uk

Ktr Uk

గ్లోబల్ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం లండన్ చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం యూకే వెళ్లిన కేటీఆర్‌కు లండన్‌లో ఘనస్వాగతం లభించింది. ఆయనకు లండన్ విమానాశ్రయంలో పలువురు ఎన్నారైలు, UK (TRS) పార్టీ విభాగం సభ్యులు స్వాగతం పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ రావుకు లండన్‌లో స్వాగతం పలికారు.

https://twitter.com/khaleelnumaan1/status/1526800833618227200

UK ఇండియా బిజినెస్ కౌన్సిల్ (UKIBC) నిర్వహించే వరుస సమావేశాలలో కేటీఆర్ హాజరవుతారు. మే 22 నుంచి 26 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల్లో భాగమవుతారు.ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, వివిధ పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడనున్నారు. తెలంగాణను ప్రపంచ కంపెనీలకు పెట్టుబడి గమ్యస్థానంగా నిలుస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

 

  Last Updated: 18 May 2022, 02:45 PM IST