Site icon HashtagU Telugu

Cyclone Mandous: తస్మాత్ జాగ్రత్త.. ఏపీకి పొంచివున్న మాండస్ ముప్పు!

Cyclone Biparjoy

Cyclone Mandous

తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన మాండాస్ తుఫాను ప్రస్తుతం ఏపీని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచించారు. తాజాగా ఏర్పడిన ఈ మాండస్ తుఫాన్ ప్రభావం ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాది జిల్లాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాలో కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

అంతేకాకుండా తాజాగా అమరావతి సచివాలయం నుంచి ఈ మాండస్ తుఫాను విషయం గురించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కోసం తిరుపతి, ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య వైఎస్సార్ కడప జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ తుఫాను 9వ తేదీ అర్ధరాత్రి నాటికి పుదుచ్చేరి,మహాబలిపురం, శ్రీహరి కోటల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావం కారణంగా 10 వరకు రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం కావాలని ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒకటి,నెల్లూరులో రెండు, తిరుపతిలో ఒకటి,చిత్తూరులో ఒకటి ఇలా మొత్తం 5 ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు సిఎస్ ప్రకటించారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో ఒకటి చొప్పున మొత్తం 4, ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు . ఈ తుఫాను ప్రభావం కారణంగా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అని అధికారులు ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.