Site icon HashtagU Telugu

Krithi Shetty First Look: మాచర్ల నియోజకవర్గం’ నుండి కృతిశెట్టి స్టైలిష్ ఫస్ట్ లుక్

Macherla

Macherla

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుండి కృతి శెట్టిని స్వాతిగా పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ట్రెండీ అవుట్ ఫిట్ తో స్టైలిష్‌గా కనిపించింది కృతి. ఆమె కూల్ గా కాఫీ ఆస్వాదించడం ప్లజంట్ గా వుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి కథానాయికగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా మరో కథానాయికగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ ‘రారా రెడ్డి’లో సందడి చేస్తోంది. ఇటివలే విడుదలైన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.

Exit mobile version