Site icon HashtagU Telugu

Tollywood : వైరల్ గా మారిన ఉప్పెన బ్యూటీ – మెగా హీరో లవ్..?

Krithi Shetty Vaishnav Tej

Krithi Shetty Vaishnav Tej

చిత్రసీమలో (Tollywood) పుకార్లు అనేవి చాల కామన్.. సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గరి నుండి ఈ పుకార్లకు అడ్డు లేకుండా పోయింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఫై కొంతమంది ప్రత్యేక ఫోకస్ చేస్తుంటారు. ఏ హీరో కానీ , హీరోయిన్ కానీ కాస్త చనువుగా ఉన్నట్లు కనిపిస్తే చాలు టక్కున వారి మధ్య ఏదో ఉందని…ఏదేదో జరుగుతుందని ప్రచారం చేయడం చేస్తుంటారు. కొన్నిసార్లు ఆ పుకార్లే నిజం అయ్యాయి అనుకోండి..కాకపోతే అన్ని ఆలా నిజం కావు కదా..

ప్రస్తుతం అతి త్వరలో మెగా ఫ్యామిలీ (Mega Family) ఇంట మెగా పెళ్లి సంబరాలు మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ (Varun Tej) – లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) లు పెళ్లి బంధం తో ఒకటి కాబోతున్నారు. సినిమా షూటింగ్ లో ఏర్పడిన పరిచయం కాస్త పెళ్లి వరకు దారి తీసింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఇదిలా ఉండగానే మరో మెగా హీరో లవ్ అంటూ ఓ వార్త సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఉప్పెన మూవీ తో ఇండస్ట్రీ కి పరిచమైన వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)..ప్రేమలో పడ్డాడని అంటున్నారు. అది కూడా మరెవరో కాదు బెబమ్మ..కృతి శెట్టి (Krithi Shetty) తోనట. ఉప్పెన సినిమాలో జంటగా కలిసి నటించిన వీరు..ఆ తర్వాత కూడా తరుచు ఫోన్లో మాట్లాడుకోవడం..కలుసుకోవడం చేస్తూ..ఇప్పుడు ప్రేమ పక్షుల్లాగా మారిపోయారని అంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ గాఢమైన ప్రేమలో మునిగారని చెపుతున్నారు.

Read Also : Kapu Community Reaction : టిడిపి తో జనసేన పొత్తు ఫై కాపు సామాజిక వర్గం రియాక్షన్ ఏంటి..?

ఈ వార్తలను కృతిశెట్టి టీం మాత్రం కొట్టిపారేస్తుంది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని..కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటివి అన్ని కేవలం రూమర్స్ మాత్రమే అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరోపక్క తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని, ప్రస్తుతానికి సినిమాలే తన ప్రాధాన్యత అంటూ కృతి శెట్టి చెప్పుకుంటూ వస్తుంది. ఇక కృతి సినీ కెరియర్ కూడా పెద్దగా ఏమిలేదు. ఉప్పెన సినిమా తర్వాత ఆమెకు భారీ అవకాశాలు వచ్చాయి. కానీ అవేమి కృతి కెరీర్ కి బూస్ట్ ఇవ్వలేదనే చెప్పాలి. ఉప్పెన సినిమా తో ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పాటు అయ్యింది. ఇప్పటికి కూడా ఆమెకు సరైన హిట్ అనేది పడలేదు. దీంతో ఆమెకు తెలుగులో చాన్సులే లేకుండాపోయాయి. సో మెగా లవ్ అనేది ఉత్త పుకారే అని తెలుస్తుంది.