Site icon HashtagU Telugu

Ukraine-Russia War: 2 లక్షల మంది సైనికులతో కీవ్ పై దాడికి దిగనున్న రష్యా?

Russia- Ukraine War

Ukraine Russia War

ఉక్రెయిన్‌ దేశంపై ఇంకా రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులలో భాగంగా ఉక్రెయిన్‌ పూర్తిగా ధ్వంసం అవుతోంది. అయితే రష్యా దాడి నుంచి ప్రజలను కాపాడటం కోసం ఉక్రెయిన్‌ సైనికులు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్‌, రష్య మధ్య జరుగుతున్న యుద్ధం పై ఉక్రెయిన్ కమాండ్ ఇన్ చీఫ్ జనరల్ వలేరీ జాలుజ్నీ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అనగా 2023 తొలి నెలల్లో రష్యా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో రష్యా భీకర దాడులకు పాల్పడవచ్చు. ఫిబ్రవరి మార్చ్ లోనే కాకుండా జనవరి చివర్లో దాడులు జరిగిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రష్యా దాడులను తగ్గించడం కూడా యుద్ధ వ్యూహంలో భాగం. అయితే ఈ గ్యాప్‌లో ఉక్రెయిన్‌ తన సైనిక బలగాలను పెంచుకోవడం ద్వారా మళ్లీ యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. యుద్ధానికి సంబంధించి ఇది చాలా వ్యూహాత్మక నిర్ణయం. ప్రస్తుతం రష్యా రెండు లక్షల మంది సైనికులను సిద్ధం చేసుకుంటోంది.

రాజధాని కీవ్‌పై రష్యా దళాలు మరోసారి దాడి చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన లక్ష్యం ఫ్రంట్‌లైన్‌ ను కాపాడుకోవడమే అని వలేరీ జాలుజ్నీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని అందుకు సిద్ధం మవుతున్నట్లు తెలిపారు. రష్యా మరోసారి విరుచుకుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్ని ట్యాంకులు, ఆయుధాలు, సైనికులు కావాలనే విషయంలో తాము కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూభాగాన్ని విడిచి పెట్టే వెళ్లే ప్రతిక్తే లేదని తెలిపారు.

Exit mobile version