Kothakota Dayakar Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు

Published By: HashtagU Telugu Desk
kothakota dayakar reddy

Whatsapp Image 2023 04 23 At 5.39.21 Pm

Kothakota Dayakar Reddy: తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కొత్తకోట దయాకర్ రెడ్డి బోన్ క్యాన్సర్ అనే మహమ్మారితో బాధపడుతున్నారు. అయితే మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ దయాకర్ రెడ్డి శరీరం సహకరించడం లేదు. దీంతో కొద్దీ రోజుల నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పిటల్‌ చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో దయాకర్ రెడ్డిని స్వగ్రామానికి తరలించారు కుటుంబ సభ్యులు.

  Last Updated: 23 Apr 2023, 05:42 PM IST