AP News : కర్నూలు జిల్లా కోసిగిలో వైసీపీ రౌడీలు పెళ్లి బృందంపై ఘోరంగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ సానుభూతి కలిగిన పెళ్లి ఊరేగింపులో, వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర దాడి చేపట్టారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఆడపిల్లల మెడలోని బంగారు, వెండి ఆభరణాలు కూడా వైసీపీ సభ్యులు లాగేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్ళితే, కోసిగిలో 3వ వార్డు కాసెమ్మగడ్డ దగ్గర వైసీపీ ఎంపీపీ ఈరన్న అనుచరులు, పెండేకంటి భాస్కర్ భార్య, కుమారులు పెండేకంటి ఆనందమ్మ, లోకారెడ్డి తదితరులు సుమారు 50 మంది పెళ్లి ఊరేగింపు పై దాడికి పాల్పడ్డారు.
PM Modi : రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ
టీడీపీ నాయకుడు పోతుల తాయన్న కుమారుడి పెళ్లి ఊరేగింపుపై మోకాళ్లతో దాడి చేయడం వల్ల అనేక మందికి గాయాలయ్యాయి. మహిళల మెడలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు వైసీపీ కార్యకర్తలు దొంగిలించారని బాధితులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోతుల నరసమ్మ తాయన్న ఫిర్యాదు మేరకు వైసీపీకి చెందిన 11 మందిపై కేసు నమోదు చేశారు.
Rajasaab Release Date : రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్.. మూవీ రిలీజ్ డేట్ కూడా