Koppula: కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఫైర్.. హామీల అమలుపై నిలదీత

  • Written By:
  • Updated On - April 21, 2024 / 05:38 PM IST

Koppula: పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ కొప్పుల మాట్లాడారు. ‘‘ప్రజలను వంచించి పెద్ద ఎక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిజం చెబితే నమ్మరు అని, అబద్ధం చెప్తే నే నమ్ముతారు అని స్వయం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం మారితే ప్రజలు మేలు జరుగుతుందని అనుకున్నారు కాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో కీడు జరుగుతున్నది. కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల సమస్యలను పరిష్కారం చూపించారు. పది సంవత్సరాలు అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపింది కేసీఆర్’’ అని కొప్పుల అన్నారు.

‘‘కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు కాకముందే వ్యవసాయం చిన్నబిన్నం అయింది, పంటలు ఎండిపోయి 200 మంది రైతులు, ఫ్రీ బస్సు తో ఆటో డ్రైవరన్నలు 50 మంది చనిపోయారు అని అంటే ఎక్కడ అని స్వయంగా ముఖ్యమంత్రి అంటున్నాడు. రైతులకు ధైర్యం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడాలి.. కాని ఒక్క మాట కూడా మాట్లాడంలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ కి ఓటు ఎందుకు చేయాలి. 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ అని మళ్ళీ రెండో నెలలు కలిపి బిల్లు ఇచ్చినందుకా… కరెంటు కోతలు, పొలాలకు నీళ్ళు ఇవ్వక 20 లక్షల ఎకరాలను పంటలను ఎండిపోయినందుకా, నిరుద్యోగులకు మెగా డీఎస్సీ అని నోటిఫికేషన్ ఇవ్వనందుకా, టెట్ దరఖాస్తుకు 200 రూపాయల ఫీజు ను 1000 రూపాయలు పెంచినందుకా’’ అని కొప్పుల ప్రశ్నించారు.