Koneru Satyanarayana : తెలంగాణలో బిజెపికి భారీ షాక్..బీఆర్ఎస్ లోకి కీలక నేత

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 01:20 PM IST

తెలంగాణ లో బిజెపి హావ తగ్గుతుందా..? అంటే అవుననే చెప్పాలి. రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ (Bandi Sanjay) ఉన్న సమయంలో బిజెపి (BJP) హావ బాగా కనిపించింది. ఇతర పార్టీ నేతలంతా బిజెపి వైపు చూడడం చేసారు. బండి సంజయ్ ఊపు చూసి చాలామంది బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ లకు రాజీనామా చేసి బిజెపి లో చేరారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి హావ పూర్తిగా తగ్గింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం..ఆ తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ పుంజుకోవడం తో చాలామంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడి పదవిని నుండి తొలగించి కిషన్ రెడ్డి కి ఇవ్వడం కూడా చాలామందికి నచ్చలేదు. దీంతో బిజెపి పార్టీ లో ఇంతకాలం ఉన్న కీలక నేతలు కూడా అధికార పార్టీ బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

తాజాగా బిజెపి నేత కోనేరు సత్యనారాయణ (Koneru Satyanarayana) సొంత పార్టీకి రాజీనామా చేసారు. మరో రెండు రోజుల్లో బిఆర్ఎస్ (BRS) లో చేరబోతున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు చూసి బీఆర్ఎస్ చేరాలని అనుకున్నట్లు తెలిపారు. 2014లో కొత్తగూడెం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన సత్యనారాయణ మూడేళ్ల క్రితం బిజెపిలో చేరారు.

‘కేసీఆర్ (KCR) సమక్షంలో ఈ నెలాఖరికి బీఆర్ఎస్ పార్టీలో చేరుతాను. నాతో ఉన్న ఏ కార్యకర్తను బీఆర్ఎస్‎లో చేరమని ఇబ్బంది పెట్టను. నా నిర్ణయానికి అనుగుణంగా రావాలని బలవంతం చేయను. కేసీఆర్ నాయకత్వంలో ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమోనని, రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందనే ఉద్దేశంతోనే బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‎లో చేరటం మంచిదని భావించాను‌. బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఇస్తానని, కొత్తగూడెం ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో మా తండ్రి ద్వారా మాకున్న పరిచయాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిపించేందుకు కృషి చేస్తాను. బీజేపీలో ఉంటే కొన్ని వర్గాల ప్రజలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అదే బీఆర్ఎస్‎లో ఉంటే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. నా భవిష్యత్తు మంచిగా ఉండేలా సహకరిస్తానని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు’ అని కోనేరు సత్యనారాయణ తెలిపారు.