Konda Vishweshwar Reddy: బీజేపీ చేరికపై కొండా క్లారిటీ!

చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక‌.. ఆయ‌న ఏ పార్టీలో చేరుతార‌నేది ఆసక్తిగా మారింది.

  • Written By:
  • Updated On - June 30, 2022 / 05:36 PM IST

చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక‌.. ఆయ‌న ఏ పార్టీలో చేరుతార‌నే విష‌య‌మై ఎన్నో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఆయ‌న తిరిగి కాంగ్రెస్ లో చేరుతారా.. లేక బీజేపీ చేరుతార‌నేదీ రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో కొండా విశ్వేశ్వరెడ్డి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. BJP రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ తో దాదాపు 45 నిమిషాలు కొండా భేటీ అయిన విషయం విధితమే.

పార్టీ మార్పుపై కొండా స్పష్టతనిస్తూ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను బీజేపీలో చేరనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని, అందుకే హుజురాబాద్ లో ఘోరంగా టీఆర్ఎస్ ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ నేతలతో మంచి సంబంధాలున్నాయని, కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిన సమయంలో రేవంత్ కు పగ్గాలు అప్పజెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో కులాలు ఉండవనీ, అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.