Site icon HashtagU Telugu

Kona Venkat : గీతాంజలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సినీ నిర్మాత

Kona Geetanjali

Kona Geetanjali

కొద్దీ రోజుల క్రితం తెనాలికి చెందిన గీతాంజలి (Geetanjali) ఆత్మహత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు…అధికార పార్టీ కి జై కొట్టిందని చెప్పి కొంతమంది ఆమెపై నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక అత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఫై యావత్ ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ..ఈ ఘటన కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రస్తుతం ఈ ఘటన ఫై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె తాజాగా గీతాంజలి కుటుంబాన్ని సినీ నిర్మాత కోన వెంకట్ (Kona Venkat) పరామర్శించారు. సోమవారం తెనాలిలోని గీతాంజలి ఇంటికి వెళ్లిన కోన వెంకట్.. ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని ధైర్యం తెలిపారు. అనంతరం గీతాంజలి కుటుంబానికి కోన వెంకట్ రూ.50 వేలు ఆర్థికసాయం అందజేశారు. గీతాంజలి ఇద్దరు కుమార్తెలను తన సొంత కూతుళ్లలాగా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇప్పటి నుంచి వారి బాధ్యత తనదని చెప్పిన కోన.. ఇప్పటినుంచి తనకు నలుగురు కూతుర్లని, గీతాంజలి కుటుంబానికి ఏ సహాయం అవసరమైనా ముందుంటానని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందన్న కోన వెంకట్.. ఆ విషయంలో తాను కూడా బాధితుడినేనని తెలిపారు.

తెలుగులో టాప్ రైటర్ గా కొనసాగుతున్న కోన వెంకట్ ప్రస్తుతానికి గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంజలి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకుడిగా కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు.

Read Also : Rajamouli : బాహుబలి 1 తరువాత రాజమౌళి.. ఫహద్ ఫాజిల్ తండ్రిని కలిసి చేసిన పని.. వారిని షాక్‌కి..