Site icon HashtagU Telugu

Komatireddy Venkatreddy: కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సాగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి స్పష్టత.!

Komatireddy Venkatreddy

Komati

కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సాగుతున్న ప్రచారంపై ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) క్లారిటీ ఇచ్చారు. తాను  కాంగ్రెస్  పార్టీకి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను నిన్నంతా సోనియా గాంధీతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దని తెలిపారు. మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు కోమటిరెడ్డి. -అధికారికంగా ప్రకటించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారమేనన్నారు. మొన్న రాహుల్ గాంధీపై అనర్హతపై గాంధీభవన్ లో చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్నట్లు చెప్పారు.

భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పిన ఆయన తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేని తనది కాంగ్రెస్ రక్తమన్నారు. బీజేపీ నుంచి ఎలాంటి ఆఫర్లు లేవన్నారు.కాంగ్రెస్ కు బై చెప్పాల్సిన అవసరం నాకు లేదని స్పష్టం చేశారు. కొత్త పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు ప్రచారం చేయకండంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే బ్రాండ్.. నేను పార్టీ మారతాననేది ఊహాగానం మాత్రమే. గతంలోనూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేశారు.ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి కొందరు లబ్ధి పొందాలని అనుకోవడం హుందాతనం అనిపించుకోదు. కాంగ్రెస్‌ లో 35 ఏళ్లుగా పని చేస్తున్నా..కాంగ్రెస్ లోనే ఉంటానంటూ ప్రకటించారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy). మొత్తానికి తాను పార్టీ మారుతున్నారని ఎప్పటి నుంచి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు.

Also Read : PM Modi: ఏప్రిల్ 8, 9 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!