తెలంగాణ (Telangana ) రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మొన్నటి వరకు బిఆర్ఎస్ vs బిజెపి గా ఉండేది కానీ..కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్ఎస్ vs కాంగ్రెస్ గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ హావ పెరుగుతుండడం తో అధికార పార్టీ పూర్తి ఫోకస్ కాంగ్రెస్ (Congress ) పైనే పెట్టింది. కాంగ్రెస్ సైతం తన దూకుడు ను రోజు రోజుకు పెంచుతుంది. వరుస పెట్టి నేతలు సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో బుధువారం భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)…బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ (KTR) ఫై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ అమెరికాలో బాత్రూంలు కడుగుతుండేవారంటూ (KTR cleaning bathrooms) కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతే కాదు సీఎం కేసీఆర్ ఫై కూడా విరుచుకపడ్డారు. సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుంది కేసీఆర్ ని ప్రశ్నించిన ఆయన.. బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. రైతులకు కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదని, వడ్డీ మాత్రమే మాఫీ అని అన్నారు. పంట నష్టానికి ఇస్తామన్న పది వేల రూపాయలు ఏమైపోయాయని కేసీఆర్ ను నిలదీశారు. తనకు ఎంపీ ,ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, తనకు బతుకు తెలంగాణ కావాలని కోమటిరెడ్డి అన్నారు. తనకు వ్యాపారాలు లేవని, గుట్టలు, కొండలు అమ్ముకోనని అన్నారు. ప్రస్తుతం వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై కౌంటర్లు ఇచ్చేందుకు బిఆర్ఎస్ నేతలు సిద్ధం అవుతున్నారు.
Read Also : Dream of Going Global Viral : అక్కడ కాఫీ తాగారంటే..ఆ బోర్డు చూడకుండా ఉండలేరు..