Site icon HashtagU Telugu

Komatireddy Raj Gopal: మునుగోడులో ఉప ఎన్నిక తధ్యమే!

Rajagopal Reddy

Rajagopal Reddy

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సోమవారం అసెంబ్లీ లో తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారానికి అందజేశారు. రాజగోపాల్ రెడ్డి లేఖను అందుకున్న స్పీకర్ రాజీనామాను ఆమోదించారు. అనంతరం గన్ పార్క్ వద్ద రాజగోపాల్ రెడ్డి మీడియానుద్దేశించి మాట్లాడారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామ చేస్తున్నానని, సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది అని గుర్తుచేశారు.

నేడు కేసిఆర్ కుటుంబం అరాచక పాలన సాగిస్తుంది అని, నా రాజీనామాతో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారు అని అన్నారు. తెలంగాణ నుంచి మునుగోడు ప్రజలు కేసిఆర్ నుంచి విముక్తి కల్పిస్తారు అన్నారు. రాజీనామా అనంతరం రాజగోపాల్ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమేనని స్పష్టమైంది. త్వరలోనే చండూర్ వేదికగా రాజగోపాల్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అమిత్ షా వస్తున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భారీ ఏర్పాట్లు చేసేందుకు నిమిగ్నమయ్యారు. అయితే రాజగోపాల్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నుంచి మరికొంత మంది నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరే అకాశాలున్నాయి.