Site icon HashtagU Telugu

Drugs : కోల్‌క‌తాలో డ్ర‌గ్స్ వ్యాపారి అరెస్ట్‌.. రూ. 5 కోట్ల విలువైన‌..!

Drugs

Drugs

కోల్‌కతాలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్ర‌గ్స్ వ్యాపారి నుంచి రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సరానికి ఒకరోజు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తన్న వ్య‌క్తిని పోలీసులు ప‌ట్టుకున్నారు. STF కోల్‌కతా పోలీసుల బృందం ఎంటాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీల్దా స్టేషన్ రోడ్‌లో నదియా జిల్లాకు చెందిన ఒక పేరుమోసిన డ్రగ్ పెడ్లర్‌ను అడ్డగించింది. సోదాల్లో అతని వద్ద నుంచి మొత్తం 1.016 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ డ్రగ్ అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.5.08 కోట్లుగా ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేశారు. నిందితుడిని నదియా నివాసి 26 ఏళ్ల ప్రశాంత సర్కార్‌గా గుర్తించారు. ప్రశాంత సర్కార్‌ను డిసెంబర్ 30న అరెస్టు చేసి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద విచారించారు. అరెస్టు చేసిన నిందితుడిని డిసెంబర్ 31న కోల్‌కతాలోని ఎన్‌డిపిఎస్ కోర్టులో హాజరుపరిచారు.