Site icon HashtagU Telugu

Kolkata gay couple: ఇద్దరు పురుషుల పెళ్లి.. అలా”గే”!

Gay Couple

Gay Couple

గే పెళ్లిళ్లు మన దేశంలో కామన్ గా మారాయి. గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన గే జంట పెళ్లిని మర్చిపోకముందే.. అలాంటి మరో పెళ్లి జరిగింది. పశ్చిమ బెంగాల్‌ లోని కోల్‌కతాకు చెందిన ఇద్దరు పురుషులు అభిషేక్ రే, చైతన్య శర్మ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. తమ మధ్య ఉన్న అసహజ సంబంధాన్ని.. మూడు ముళ్ళ బంధంతో పర్మినెంట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ధోతీలో అభిషేక్,
షేర్వాణీలో చైతన్య శర్మ పెళ్లి కోసం ముస్తాబై వచ్చారు. ఈసందర్భంగా హల్దీ వేడుక కూడా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఒకరి మెడలో మరొకరు పూల దండలు వేసుకొని ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో ఇవి వైరల్‌ అయ్యాయి.

తెలంగాణలో తొలి ‘గే’ వివాహం..

తెలంగాణలో తొలి ‘గే’ వివాహం 2021 డిసెంబరు 20న జరిగింది. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న అభయ్‌ డాంగ్, సుప్రియో చక్రవర్తి.. తమ కుటుంబ సభ్యులను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు.
ఢిల్లీకి చెందిన అభయ్‌ డాంగ్‌ (34) హైదరాబాద్‌లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన సుప్రియో చక్రవర్తి (31) కూడా నగరంలోనే ఈ కామర్స్‌ సంస్థ ఉద్యోగి. వీరిద్దరూ 8 ఏళ్ల క్రితం ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమయ్యారు. పెళ్లికి ముందు.. నాలుగేళ్లుగా గచ్చిబౌలిలో గుట్టుగా సహజీవనం చేస్తున్నారు.

Exit mobile version