Site icon HashtagU Telugu

Anushka Sharma : క్రికెటర్​గా మారిపోయిన కోహ్లీ భార్య అనుష్క

Anushka Sharma Bollywood Re-Entry

Movie

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ (Anushka Sharma) బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాలీవుడ్ (Bollywood) రీఎంట్రీకి సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన భారత మహిళా క్రికెట్ దిగ్గజ క్రీడాకారిణి జులన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ (Chakda Express) తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం అనుష్క ఎంతగానో కష్టపడింది. అచ్చం గోస్వామిగా రూపాంతరం చెందింది. ఇందుకు ప్రత్యేక ట్రెయినింగ్ తీసుకుంది. ఎన్నో రోజులు కష్టపడి గోస్వామి మాదిరిగా బౌలింగ్ వేయడం నేర్చుకుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని అనుష్క (Anushka Sharma) స్వయంగా వెల్లడించింది. చివరి రోజు షూటింగ్ కు జులన్ ను కూడా చిత్ర బృందం ఆహ్వానించింది.

సినిమా ముగింపు షాట్ నకు జులన్ క్లాప్ కొట్టింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా టీమిండియా జెర్సీ ధరించిన అనుష్క.. దర్శకుడు ప్రోసిత్ రాయ్, జులన్ తో కలిసి కేక్ కట్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమెతో సరదాగా దిగిన మరికొన్ని ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఇక, ఈ చిత్రం కోసం తనకు ఎంతగానో సహకరించడంతో పాటు చివరి క్లాప్ కొట్టిన జులన్ కు అనుష్క ధన్యవాదాలు చెప్పింది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం  వచ్చే ఏడాది నేరుగా నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Also Read:  5G Services : విమానాశ్రయానికి సమీపంలో ఉండే వారికి 5జీ సేవలు ఇప్పట్లో లేనట్టే!