Site icon HashtagU Telugu

Kohli: ఫోన్ పోగొట్టుకున్న కోహ్లీ.. అదిరిపోయే పోస్ట్ పెట్టిన జొమాటో!

Virat Kohli Phone Lost Tweets Gets Response Asking Anushka Sharma To Order Ice Cream 001

Virat Kohli Phone Lost Tweets Gets Response Asking Anushka Sharma To Order Ice Cream 001

Kohli: టీమిండియా రన్స్ మెషీన్, యాంగ్రీ మెన్ గా పేరు గడించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. క్రికెట్ మైదానంలో కోహ్లీ ఉన్నాడంటే అక్కడ వాతావరణమే మారిపోతుంది. అలాంటి కోహ్లీ ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం తెగ కష్టపడుతున్న విరాట్ కోహ్లీ.. తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ పోస్ట్ కి కొంతమంది నవ్వేలా కౌంటర్లు వేస్తుంటే, మరికొందరు మాత్రం తమ బాధను వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ.. తాజాగా తన ఫోన్ ని పోగొట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘కొత్త ఫోన్ ని కనీసం అన్ బాక్స్ చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్ ని చూశారా?’ అని కోహ్లీ పోస్ట్ పెట్టాడు. దీంతో కోహ్లీ అభిమానులు అతడిని ఓదార్చేలా పలు పోస్టులతో వెల్లువెత్తారు. కానీ మరికొందరు మాత్రం ఈ విషయంలో తమదైన కామెడీని పండిస్తున్నారు.

అయితే కోహ్లీ చేసిన పోస్టుకు ఫుడ్ డెలివరి యాప్ జొమాటో కౌంటర్ ఇస్తూ చేసిన పోస్ట్ అందరినీ ఆకర్షించింది. ‘వదిన ఫోన్ నుంచి ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చేందుకు ఏమాత్రం సందేహించొద్దు. అది ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది’ అంటూ జొమాటో పోస్ట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు.. జొమాటో బిజినెస్ ని ఎలా చేయాలో భలే చూపిస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా విరాట్ కోహ్లీ తనకు కావాల్సిన దగ్గరి వారి కోసం ఫోన్ కొనుగోలు చేయగా.. అది కనిపించకుండా పోయిందని తెలుస్తోంది. కొందరు మాత్రం విరాట్ కోహ్లీ ఫోన్ ఏమీ పోలేదని, వివో ఫోన్ ప్రమోషన్ లో భాగంగానే కోహ్లీ ఇలా పోస్ట్ చేశాడని, అదో పెయిడ్ పోస్ట్ అని అంటున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ ఫోన్ పోయిన పోస్ట్ ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం అవడంతో పాటు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించేలా చేసింది.