Site icon HashtagU Telugu

Virat Kohli Record: హిట్ మ్యాన్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ

Rohit-Virat

Rohit-Virat

హాంకాంగ్ తో మ్యాచ్ తో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. చాలా కాలంగా పరుగుల కోసం తంటాలు పడుతున్న కోహ్లీ పాక్ పై 35 పరుగులు చేయగా… హాంకాంగ్ పై హాఫ్ సెంచరీ సాధించాడు. 40 బంతుల్లోనే అర్థసెంచరీ చేసిన విరాట్ అరుదైన రికార్డ్ సాధించాడు.

ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉన్న ఓ వరల్డ్‌ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 31వ హాఫ్‌సెంచరీ సాధించిన కోహ్లీ… రోహిత్‌ పేరిట ఉన్న అత్యధిక హాఫ్‌సెంచరీలరికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో రోహిత్ 31 హాఫ్ సెంచరీలు చేయగా… కోహ్లీ దానిని అందుకున్నాడు. రోహిత్‌ 134 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డ్ అందుకోగా..కోహ్లి 101 మ్యాచ్‌ల్లోనే చేరుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్‌సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో కోహ్లి, రోహిత్‌ల తర్వాతి స్థానాల్లో బాబర్‌ ఆజామ్‌ , డేవిడ్‌ వార్నర్‌ , మార్టిన్‌ గప్తిల్‌ ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కూడా మరో అరుదైన రికార్డును అందుకున్నాడు .అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ రికార్డులకెక్కాడు. రోహిత్ శర్మ 134 మ్యాచ్‌ల్లో 3520 పరుగులు చేశాడు. రోహిత్‌ తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్‌ వెటరన్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ , మూడో ప్లేస్‌లో విరాట్‌ కోహ్లి ఉన్నారు. కాహా హాంకాంగ్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ 21 రన్స్ చేయగా… కోహ్లీ 59 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.