Site icon HashtagU Telugu

Rooster: మర్డర్ కేసులో కోడి అరెస్ట్… తర్వలో కోర్టు ముందుకు కోడి

Whatsapp Image 2023 03 02 At 21.53.39

Whatsapp Image 2023 03 02 At 21.53.39

Rooster: ఆ మధ్య ఒకసారి కోడి మృతి కేసు దేశంలో చర్చనీయాంశమైంది. తన పొరుగింటి వ్యక్తి దురుద్దేశంతో కుట్రపన్ని తన కోడిని హతమార్చాడంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‭లో కేసు నమోదు చేశారు. అప్పుడు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్య పరిచింది. అయితే దీనికి పూర్తిగా భిన్నమైన ఘటన తెలంగాణలో జరిగింది. ఒక వ్యక్తి మృతి కేసులో పోలీసుల కోడిని అరెస్ట్ చేశారు.

జగిత్యా జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్‭లో ఈ కోడి కేసు నమైంది. సాధారణంగా ఏదైనా మర్డర్ జరిగినప్పుడు దానికి కారణం అయిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. అయితే ఓ మనిషిని చంపిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేస్తారు. నేరం కోర్టులో రుజువైతే కోర్టు దోషిగా తేల్చిన తర్వాత వారికి శిక్షలు వేస్తుంటారు. కానీ ఇక్కడ కోడి అరెస్ట్ చేయటంతో ఎలా శిక్ష వేస్తారని ఆందరూ థింక్ చేస్తున్నారు.

కొండపూర్‭కు చెందిన సత్తయ్య అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. తను పెంచుకున్న కోడి తన ప్రాణాలే తీసింది. కోడి కాలికి కట్టిన కత్తి పొరపాటున పొట్టలో గుచ్చుకోవడంతో సత్తయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సత్తయ్య మృతికి కారణమైన కోడిని అరెస్ట్ చేశారు. సత్తయ్య మృతికి కోడే ఏ-1 ముద్దాయిగా చేర్చి పోలీస్ స్టేషన్‭కు తీసుకొచ్చారు. ఇక కోడిని తొందరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు కూడా వారు పేర్కొన్నారు.

Exit mobile version