AP Politics: చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

  • Written By:
  • Updated On - April 18, 2024 / 06:55 PM IST

AP Politics: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 22వరోజుకు చేరుకుంది.  ప్రజలతో కలిసి ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఐదేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని.. పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్యే నాని అభివర్ణించారు.

ఎన్నికల్లో జగన్ పేదల పక్షమన్నారు.. రాబోయే ఐదేళ్లలో మీరు ఏ దారిలో నడవాలని ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు.జగన్‌కు ఓటేస్తే ఈ మంచి అంతా కొనసాగుతుందని….. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలుకుతారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతాం అనేది చరిత్ర చెబుతున్న సత్యమన్నారు.

ప్రజలందరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఎమ్మెల్యేగా నన్ను…. ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, సీనియర్ నాయకులు పాలేటి చంటి, దుక్కిపాటి శశి భూషణ్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, జడ్పిటిసిలు గోళ్ళ రామకృష్ణ , కందుల దుర్గా కుమారి,ఎంపీపీలు ఉన్నారు.