Site icon HashtagU Telugu

Kodali Nani: రోడ్డుపై గుంతలను చూపిస్తూ, అభివృద్ధి జరగలేదంటూ ప్రతిపక్షాలు చిందులు తొక్కుతున్నాయి : కొడాలి నాని

Kodali Nani: గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం పర్యటించారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే నానికు వైఎస్ఆర్సిపి శ్రేణులు, గజమాలలు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీగా పర్యటించిన నానికు వీధి వీధినా మల్లాయి పాలెం గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. మల్లయిపాలెం వాటర్ వర్క్స్ వద్ద కోటి,11 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన O.H.S.R త్రాగునీటి వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, ఎంతమంది తిట్టినా, పేద ప్రజల ఉన్నతికి వెనకడుగు వేయకుండా కష్టపడుతున్న సీఎం జగన్, గొప్ప నాయకుడని కొనియాడారు. విజయవాడ నుండి గుడివాడ వచ్చేవరకు వేలాది కోట్లతో ఫోర్ వే రహదారులు, రైల్వే ఫ్లే ఓవర్లను ప్రభుత్వం నిర్మిస్తున్న, రోడ్డుపక్కన చిన్న గుంటను చూపిస్తూ, అభివృద్ధి జరగలేదంటూ ప్రతిపక్షాలు చిందులు తొక్కుతున్నాయని ఆయన విమర్శించారు.

ప్రతిపక్ష టిడిపి కోర్టులకు వెళ్లడం వల్లనే గుడివాడ పురపాలక సంఘంలో విలీనమైన మల్లాయిపాలెంలో ఎన్నికలు జరగలేదని, గ్రామ అభివృద్ధికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ తాము అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.సభా వేదికపై పలువురు ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు ప్రజల శ్రేయస్సుకు సీఎం జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగించారు.

Exit mobile version