Kodali Nani: చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది : కొడాలి నాని సెటైర్లు

  • Written By:
  • Updated On - April 29, 2024 / 11:33 PM IST

Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 33వ రోజుకు చేరుకుంది. వైసిపి శ్రేణులు ఎమ్మెల్యే కొడాలి నానికు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడంతో పాటు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్ ను ఆశీర్వదించాలని ప్రజానీకాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని కోరారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదని.. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టి దొంగ హామీలిచ్చి ప్రజలను వంచించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌.. సూపర్‌ టెన్‌ అంటూ నమ్మబలుకుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే కొడాలి నాని. మళ్లీ అదే కూటమి.. మళ్లీ అదే సంతకం.. మళ్లీ అవే మోసాలు.. హిస్టరీ రిపీట్‌ అంటూ మండిపడ్డారు.

చంద్రబాబును ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని..లకలకలక అంటూ పేదల రక్తం తాగుతుందని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబుకు ఓటేస్తే పశుపతిని ఇంటికి తెచ్చుకున్నట్టే అని కామెంట్ చేశారు. పులినోట్ల తలపెట్టడమే అని కామెంట్ చేశారు.58 నెలలు పాలించిన సిఎం జగన్ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తొస్తాయన్నారు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు తీసుకొస్తే.. సిఎం జగన్ గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడని చెప్పారు. చంద్రబాబు దమ్ముంటే తాను గెలిస్తే మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చెప్పగలరా అని సవాల్ చేశారు.

వలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థలు గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెబుతున్నాయన్నారు ఎమ్మెల్యే నాని. 58 నెలల సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ పథకాలు లంచాలు, వివక్ష లేకుండా అందరికీ అందాయని.. ఐదేళ్లకు ముందు ఈ పరిస్థితి ఉందా అని నాని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు.. తన పాలన చేసిన ఒక్క మంచిపనైనా చూపించి ఓట్లు అడిగే సత్తా ఉందా అని ప్రశ్నించారు కొడాలి నాని . తన ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో పాటు.. 2 లక్షల 30వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు .75శాతం పథకాలు పేద వర్గాలకే అందాయన్నాయని,రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు ఎగ్గొట్టిన ఘనుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు.