Kodali Nani: పురందేశ్వరి, చంద్రబాబు కలసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. అందుకే ఆయన అరెస్టును పురందేశ్వరి ఖండిస్తున్నారని మంత్రి కొడాలి నాని (Kodali Nani) విమర్శించారు. తలపై ఎవరిదో బొచ్చు పెట్టుకొని తిరుగుతున్న బాలకృష్ణ.. ఇప్పుడైనా కనీసం బ్రెయిన్ అయినా వాడాలన్నారు. ‘బాలకృష్ణ బొచ్చు లెస్.. బ్రెయిన్ లెస్’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ తీసుకొనే పవన్.. ఆయనకు మద్దతుగా మాట్లాడటం సహజమే అని వ్యాఖ్యానించారు.
అంతకముందు చంద్రబాబు అరెస్ట్ పై కొడాలి నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండింది అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన పోస్ట్ కింద కరప్షన్ కింగ్ సీబీఎన్, స్కామ్ స్టేర్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్స్ ను కూడా జత చేశారు. చంద్రబాబు చేసిన పాపాలకు అతిత్వరలోనే శిక్ష పడుతుందంటూ ఇప్పటికే పలుమార్లు కొడాలి నాని మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టానికి ఎవరూ చుట్టాలు కాదన్నారు. చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు.
స్కాములు చేస్తే అరెస్టు చేయరా..?: మంత్రి పెద్దిరెడ్డి
స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు చంద్రబాబు అని విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. స్కాములు చేస్తే అరెస్టు చేయరా అని ప్రశ్నించారు. మొత్తం రూ.3,356 కోట్ల ప్రాజెక్ట్‌లో 90 శాతం సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ.371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో ప్రభుత్వ డబ్బును మాత్రం ఖర్చు చేయించి చంద్రబాబు అండ్ కో మింగేశారని తెలిపారు.