Site icon HashtagU Telugu

Kodali Nani : పురందేశ్వరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కొడాలి నాని…!!

ఏపీలో వైసీపీ నేతలకు, విపక్షాలకు తగ్గాఫర్ నడుస్తూనే ఉంది. విమర్శలు…ప్రతివిమర్శలు చేసుకుంటూ తగ్గేదేలే అంటున్నారు.తాజాగా గుడివాడకు కేంద్రం పలు ఫ్లైఓవర్లను ప్రకటించింది. అయితే వాటిని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరీ అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేత, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

పురందేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శిలో హోదాలో ఉన్నారని…అదే హోదాతో గుడివాడకు ముంజూరైన ఫ్లైఓవర్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు నాని. ఈ మేరకు సోమవారం ఈ అంశాన్ని మీడియా ముందు ప్రస్తావించారు కొడాలి నాని. పురందేశ్వరికి హెచ్చరికలు జారీ చేసిన నాని…ఇప్పటికైనా గుడివాడ డెవలప్ మెంట్ పనులను అడ్డుకునే ప్రయత్నం వివరమించాలని పురందేశ్వరికి సూచించారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు నాని.

 

Exit mobile version