AP Politics : కౌంటింగ్‌ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యాన్ని సంపాదించుకున్నారని తొలి నివేదికలు సూచిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - June 4, 2024 / 10:39 AM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యాన్ని సంపాదించుకున్నారని తొలి నివేదికలు సూచిస్తున్నాయి. రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ, మండపేట, నెల్లూరు వంటి కీలక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ట్రెండ్ ప్రకారం టీడీపీకి ఎక్కువగా ఓట్లు వేశారని భావిస్తున్న ఉద్యోగులు ఎన్నికల ఫలితాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు టీడీపీకి స్పష్టమైన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నందున, మొత్తం ఓటింగ్ శాతం ఇదే పద్ధతిని అనుసరిస్తుందని అంచనా వేయబడింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీ 2024 ఎన్నికల్లో అద్భుతంగా పుంజుకుంది. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించడంతో పాటు నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంతో పాటు నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, ఉదయగిరి, వెంకటగిరి, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలంగా ఓటింగ్ దాదాపుగా ఓ వైపు జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. గుడివాడ నియోజకవర్గంలోనూ టీడీపీ ఆధిక్యం కొనసాగుతోంది. అయితే.. 2004 నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని కొనసాగుతున్నారు. మొదటి రెండు పర్యాయాలు టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని.. ఆ తర్వాత రెండుసార్లు జగన్ పార్టీ నుంచి విజయం సాధించారు. అయితే… తాజా ఎన్నికల ఫలితాల్లో గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ముందంజలో ఉన్నారు. 1385 ఓట్ల ఆధిక్యంలో రాము ఉన్నారు. దీంతో.. రాము లీడ్‌లో కొసాగుతుండటంతో కౌంటింగ్ సెంటర్ నుంచి కొడాలి నాని వెళ్లిపోయారు. దీంతో పాటు.. గన్నవరం అసెంబ్లీ స్థానంలోనో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కౌంటింగ్‌ సెంటర్‌ నుంచి వెళ్లిపోయారు. దీంతో… తమ ఓటమి ఖయామైందని వారు నైతికంగా అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారని టీడీపీ నేతలు అంటున్నారు.

Read Also : AP Results 2024: మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటిన ఎన్డీఏ కూటమి..ఆధిక్యంలో టీడీపీ