Site icon HashtagU Telugu

9 Year Renames : 9 ఏళ్ల బీజేపీ హయాంలో వీటి పేర్లు మారిపోయాయి

9 Year Renames

9 Year Renames

9 Year Renames : ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వాడివేడి వాగ్యుద్ధం జరిగింది.  

ఈనేపథ్యంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం చరిత్ర గురించి తెలుసుకుందాం..

గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో దేశంలో ఇలా పేరు మారిపోయిన(9 Year Renames) ముఖ్యమైన ప్రదేశాలు, నిర్మాణాలపై ఒక లుక్ వేద్దాం.. 

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (NMML) అనేది భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని ఒక స్వయంప్రతిపత్తి త్త సంస్థ. ఇది ఢిల్లీలోని తీన్ మూర్తి మార్గ్‌లో ఉంది. ఇక్కడ దేశంలోని జర్నలిస్టులు, రచయితలు, పరిశోధనా విద్యార్థులు నెహ్రూ కాలపు ప్రభుత్వాలు, విధానాల గురించి అధ్యయనం చేస్తారు. ఇప్పుడు దీని పేరు ‘ప్రధాన మంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ’గా మార్చబడింది.

నెహ్రూ మెమోరియల్ చరిత్ర

1929-30లో భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో ఎడ్విన్ లుటియన్స్ ఇంపీరియల్ క్యాపిటల్‌ నిర్మాణంలో భాగంగా ఈ సముదాయాన్ని నిర్మించారు. ఇది భారతదేశంలో బ్రిటీష్  కమాండర్-ఇన్-చీఫ్ యొక్క అధికారిక నివాసం. 1948 ఆగష్టులో ఇది స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూ యొక్క అధికారిక నివాసంగా మారింది. ఇక్కడ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1964 మే 27 వరకు 16 సంవత్సరాలు నివసించారు. నెహ్రూ మరణానంతరం ఈ సముదాయాన్ని దేశ తొలి ప్రధానికి అంకితం చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.  1964 నవంబర్ 14న నెహ్రూ 75వ జయంతి సందర్భంగా అప్పటి రాష్ట్రపతి ఎస్. రాధాకృష్ణన్ తీన్ మూర్తి భవన్‌ను జాతికి అంకితం చేసి నెహ్రూ మెమోరియల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. రెండు సంవత్సరాల తరువాత ఈ సంస్థను నిర్వహించడానికి NMML సొసైటీని స్థాపించారు.  

ఈ పేర్లు కూడా మార్చేశారు..