GPay and PhonePe: గూగుల్ పే, ఫోన్ పే లో డబ్బులు జమ అవుతున్నాయా… కారణం ఇదే?

సాధారణంగా ఎలక్షన్స్ సమయంలో రాజకీయ నాయకులు ప్రజలకు ఓటు వెయ్యమని అడగడంతో పాటుగా ఓటుకు

  • Written By:
  • Updated On - October 13, 2022 / 12:05 PM IST

సాధారణంగా ఎలక్షన్స్ సమయంలో రాజకీయ నాయకులు ప్రజలకు ఓటు వెయ్యమని అడగడంతో పాటుగా ఓటుకు డబ్బులు ఇంత అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక పార్టీని మించి మరొక పార్టీ వారు ఎక్కువ డబ్బులను ఇచ్చి ఎక్కువ ఓట్లు రావాలి అని అనుకుంటూ ఉంటారు. ఎలక్షన్స్ సమయంలో రాజకీయాలలో పోటీ చేసే నాయకులు ఇంటింటికి వచ్చి మరి చేతులు జోడించి దండం పెట్టి మరి డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉంటారు.

అయితే ఇవన్నీ కూడా పోలీసులకు, ప్రత్యర్థి రాజకీయ నాయకులకు దొరకకుండా లోలోపల కానీచ్చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రూటు మారింది అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో రాజకీయ నాయకులు టెక్నాలజీని విపరీతంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటర్ల కోసం డబ్బును చేతికి ఇవ్వకుండా గూగుల్ పే, ఫోన్ పే లకు నెంబర్లకు డబ్బులు పంపుతున్నారట.

అయితే ఓటర్లకు రాజకీయ నాయకులు నేరుగా డబ్బు ఇస్తే పోలీసులకు మీడియా అలాగే ప్రత్యర్థి రాజకీయ నాయకులకు దొరికే అవకాశం ఉన్నందువల్ల ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించి ఓటర్లకు డబ్బు అందే విధంగా చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా ఏదైనా అకౌంట్ నుంచి పది లక్షలకు మంచి లావాదేవీలు జరిగితే సమాచారం ఇవ్వాలి అని బ్యాంకులలో ఈసీ కోరింది. దీంతో ఎక్కడికక్కడ పంపిణీ పనిని బూత్ స్థాయి ఊరి లీడర్లకు పార్టీలు అప్పగిస్తున్నాయట.