Aadhaar: మొబైల్ నెంబర్ మార్చారా.. అయితే కొత్త నెంబర్ ఆధార్ తో లింక్ చేసుకోండిలా?

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది కీలకంగా మారిపోయింది. ప్రభుత్వానికి సంబంధించిన పండ్లతో పాటుగా ప్రైవేట్

  • Written By:
  • Publish Date - October 11, 2022 / 06:00 PM IST

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది కీలకంగా మారిపోయింది. ప్రభుత్వానికి సంబంధించిన పండ్లతో పాటుగా ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవాలి అన్న కూడా ఆధార్ కార్డు అన్నది కీలకం అని చెప్పవచ్చు. అంతే కాకుండా ప్రభుత్వాలు అందించే ఎటువంటి స్కీమ్స్ పొందాలి అన్నా కూడా ఆధార్ కు మొబైల్ నెంబర్ తప్పకుండా లింక్ తప్పనిసరి. అయితే కొన్ని సార్లు అనుకోకుండా ఆ నెంబర్ పోయినప్పుడు లేదంటే నెంబర్ మార్చినప్పుడు ఏం చేయాలి అని చాలామంది మదన పడుతుంటారు.

మరి మొబైల్ నెంబర్ మార్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకవేళ ఆధార్ కార్డ్‌లో కొత్త మెుబైల్ నంబర్ ను అప్‌డేట్ చేయాలి అనుకున్న వారికోసం UIDAI కార్డ్ హోల్డర్లకు ఈ విషయంలో సులువుగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఇందుకోసం ముందుగా UIDAI అధికారిక వెబ్ సైట్ లేదంటే దగ్గరలోని ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సంప్రదించాలి.

అలాగే అపాయింట్ మెంట్ కూడా తీసుకోవాలి. ఆ తరువాత మనకు అపాయింట్ మెంట్ ఏ రోజు అయితే ఇచ్చారో ఆ రోజు ఆధార్ కేంద్రంలోని అధికారిని సంప్రదించాలి. ఆ తరువాత అక్కడి అధికారికి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారమ్ ను పూర్తి చేసి అందించాలి. అప్పుడు ఆధార్ ఏజెంట్ మీరు అందించిన వివరాలను బయోమెట్రిక్ సమాచారంతో సరిపోల్చి చూసి ఆ తరువాత మీ మెుబైల్ నంబర్ అప్ డేట్ చేసి కొత్త నంబర్ లింక్ చేస్తారు. అయితే ఇందుకుగాను సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.