Site icon HashtagU Telugu

KL Rahul: గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టులో కేఎల్ రాహుల్ పాస్..

KL Rahul

New Web Story Copy 2023 09 03t170731.301

KL Rahul: టీమిండియా కీలక ప్లేయర్ కేఎల్ రాహుల్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఆసియా కప్ 2023కి ఎంపిక చేసిన 17 మంది సభ్యులతో కూడిన జట్టులో కేఎల్ రాహుల్ కి చోటు కల్పించారు.పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రాహుల్ పూర్తిగా కోలుకోలేని కారణంగా మొదటి రెండు మ్యాచ్‌లు ఆడటం లేదని కోచ్ ద్రావిడ్ స్పష్టం చేశాడు.అయితే ఈ రోజు జరిపిన ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయినట్టు NCA తెలిపింది.

కేఎల్ రాహుల్ 54 వన్డే మ్యాచ్ లలో 45.13 సగటుతో 1,986 పరుగులు చేశాడు. అందులో 13 అర్ధ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. ఫార్మేట్ ఏదైనా ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. ప్రస్తుతం టీమిండియాను మిడిల్ ఆర్డర్ సమస్య వేధిస్తుంది. కేఎల్ రాహుల్ జట్టులో చేరితే మిడిల్ ఆర్డర్ లో రాణిస్తాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Elephant Art House: వ్యర్ధాలతో నిర్మించిన ఇంటికి 28 ఏళ్లు.. చూడటం కోసం భారీగా ఎగబడుతున్న జనం?