Site icon HashtagU Telugu

KL Rahul Fined: కెఎల్ రాహుల్ కు భారీ జరిమానా..!!

KL Rahul

KL Rahul

కేఎల్ రాహుల్….IPL2022 సీజన్ లో అత్యధిక మొత్తం అందుకుంటున్న క్రికెటర్ గా టాప్ లో నిలిచాడు. పెద్దగా అంచనాలు లేకుండా IPL2022సీజన్ ను ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్…మొదటి ఏడు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్ లో 18 పరుగులు తేడాతో ఓడిపోయింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో 163పరుగులకే పరిమితమైంది లక్నో. జోష్ హజల్ వుడ్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్ కీలక మలుపు తిప్పింది. అయితే 19వ ఓవర్ ఫస్ట్ బాల్ వైడ్ ఇవ్వకపోవడంపై అంపైర్ పై స్టోయినిస్ అసహనం వ్యక్తం చేశాడు.

ఆ తర్వాత బంతికే మార్కస్ స్టోయినిస్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు హజల్ వుడ్. అంపైర్ ను బూతులు తిడుతూ పెవిలియన్ చేరిన స్టోయినిస్ తన పక్కనుంచే వెళ్తున్న ఓ RCB ప్లేయర్ పైకి బ్యాటు కూడా ఎత్తాడు. మళ్లీ దించి …కోపంతో డగౌటక్ కు వెళ్లాడు. ఆ ఓవర్లో స్టోయినిస్ వికెట్ లాస్ అయిన లక్నో కేవలం 3 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. దీంతో లాస్ట్ ఓవర్లో 30పరుగులు రావాల్సి ఉండటంతో 12 పరుగులు చేసిన లక్నో, 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మార్కస్ స్టోయినిస్ అంపైర్ తో దురుసుగా ప్రవర్తించినందుకు అతన్ని మందలించి వదిలేసిన రిఫరీ..లక్నో టీం కెప్టెన్ కెఎల్ రాహుల్ కు 20శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించింది. IPL2022లో ప్రతీ మ్యాచ్ లో రూ.1.20కోట్లు మ్యాచుగా ఫీజుగా తీసుకుంటున్న కెఎల్ రాహుల్, స్టోయినిస్ ప్రవర్తన కారణంగా దాదాపు రూ. 24లక్షలు జరిమానాగా చెల్లించబోతున్నాడు.

Exit mobile version