Site icon HashtagU Telugu

Mallu Ravi: కిషన్ రెడ్డివి పగటి కలలు, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు : మల్లు రవి

Mallu

Mallu

Mallu Ravi: మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఇవాళ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని ఆయన అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కు అయ్యి లిపాయి కారి ఒప్పందాలతో చీకటి రాజకీయాలు చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే సంపూర్ణాంగా మద్దతు పలికారని విమర్శించారు. రాబోయే ఫలితాలలో తెలంగాణ లో కాంగ్రెస్ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందని, దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయమని, కిషన్ రెడ్డి అభినవ గోబెల్స్ గా మారిపోయారని, అబద్దాలు ఆడడంలో గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతారని, బీజేపీ మాటలను ప్రజలు నమ్మలేదు.. ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం ఖాయమని మల్లు రవి అన్నారు.

కాగా  ఏపీలో 100 శాతం ఎన్డీఏ కూటమిదే విజయమని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అక్కడ కచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం నెలకొల్పుతుందని చెప్పారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని, రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేశాయని, అయినా ప్రజలు బీజేపీనే నమ్మి ఓట్లేశారన్నారు. రెండు రాష్ట్రాల్లో అధిక ఎంపీ సీట్లు సాధిస్తాం అని ఆయన పేర్కొన్నారు.