Congress : ప్రజల్ని విడగొట్టడమే కాంగ్రెస్ పని – కేంద్రమంత్రి కిషన్ రెడ్డ్డి

Congress : హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని వర్గీకరించడం ఎక్కడ చట్టంలో ఉంది? అంటూ ప్రశ్నించారు

Published By: HashtagU Telugu Desk
Kishan Reddy Caste Census

Kishan Reddy Caste Census

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) నిర్వహించిన కులగణన(Caste Census)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “కుల గణన పేరుతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని వర్గీకరించడం ఎక్కడ చట్టంలో ఉంది? ” అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను బీసీలతో కలిపి అసలైన బీసీలకు అన్యాయం చేసిందని , కుల గణన జరిపిన విధానం సరికాదని చాలా బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అని పేర్కొన్నారు.

Theertha Mukkoti: ఫిబ్రవరి 12న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

దీనివల్ల వాస్తవమైన సమాచారం బయటకు రాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం గణనను వక్రీకరించారని విమర్శించారు. ఇక ప్రజలను మతాల మరియు కులాల పేరిట విడగొట్టడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని , ఇది కాంగ్రెస్ మరియు రాహుల్ గాంధీకి అలవాటే అని ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, అప్పుడే వీరు మతాలు, కులాలు తెరపైకి తెస్తారు అని కిషన్ రెడ్డి ఆరోపించారు.

నిజమైన బీసీల హక్కులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను సమీక్షించి సరైన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాలు కోరుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించే విధంగా కాకుండా, బీసీలకు న్యాయం చేసే విధంగా వ్యవహరించాలని సూచించారు. కిషన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కులగణనపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  Last Updated: 07 Feb 2025, 06:04 PM IST