Kishan Reddy On KCR: కల్వకుంట్ల పాలనలో డమ్మీ ఎమ్మెల్యేలు

బీజేపీ సమావేశానికి ఒక్కరోజు ముందుగా శనివారం టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
7267kishanreddy Imresizer

బీజేపీ సమావేశానికి ఒక్కరోజు ముందుగా శనివారం టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం మునుగోడులో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. ఎమ్మెల్యేలను డమ్మీ చేసి కల్వకుంట్ల కుటుంబం హీరోల్లా ప్రవర్తిస్తోందని, మునుగోడులో కూడా హుజూరాబాద్ ఉపఎన్నిక రిపీట్ అవుతుందని అన్నారు.

ఆదివారం సాయంత్రం మునుగోడులో జరిగే భారీ బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ బీజేపీలో చేరుతారని, డబ్బులు ఇచ్చి బీజేపీ బహిరంగ సభకు జనాన్ని రప్పించబోదని స్పష్టం చేశారు. “సమావేశానికి స్వచ్ఛందంగా హాజరు కావడానికి ఇష్టపడే వ్యక్తులకు మాత్రమే మేం రవాణా సౌకర్యం అందిస్తాము” అని ఆయన చెప్పారు. అంతకుముందు బీజేపీ నేతలు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

  Last Updated: 21 Aug 2022, 12:12 AM IST