Telangana BJP: తెలంగాణ బీజేపీలో అధ్య‌క్షుడి మార్పుపై క్లారిటీ ఇచ్చిన కిష‌న్ రెడ్డి.. సెటైర్లు వేసిన బండి సంజ‌య్‌

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడి మార్పుపై అధిష్టానం ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఎవరికి గందరగోళం లేదని అన్నారు.

  • Written By:
  • Updated On - June 28, 2023 / 09:42 PM IST

తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీతో స‌హా బీజేపీ (BJP), కాంగ్రెస్ పార్టీ (Congress Party) లు ఎన్నిక‌ల వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది మేమంటేమేంటూ ఆ పార్టీ నేత‌లు ధీమాతో ఉన్నారు. గ‌త నెల‌లో వెలువ‌డిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ముందు వ‌ర‌కు తెలంగాణ‌లో బీజేపీ హ‌వాసాగింది. కానీ క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత ఉన్న‌ట్లుండి తెలంగాణ‌లో కాంగ్రెస్ హ‌వా పెరిగింది. బీజేపీలో చేరుతార‌నుకున్న నేత‌లంతా కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణలో బీజేపీ అధ్య‌క్షుడి మార్పుపై విస్తృత ప్ర‌చారం జ‌రిగింది.

తాజాగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అధ్య‌క్షుడి మార్పు విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీ అధ్య‌క్షుడి మార్పుపై అధిష్టానం ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఎవరికి గందరగోళం లేదు. అధ్యక్ష మార్పుపై కేంద్ర పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.. చర్చ కూడా లేదు. వార్తలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు అని అన్నారు. బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా ఈ విష‌యంపై స్పందించారు. అధ్య‌క్షుడు మార్పు ఉంటుందో లేదో మా న‌డ్డాను అడిగి చెబుతాను అంటూ సెటైర్లు వేశారు. అధ్యక్షుడు మార్పు మీడియా సృష్టే. పదేపదే చెప్పడం మీడియా అలవాటు అయింది. వినడం మా కార్యకర్తలకు అలవాటు అయింది అంటూ పేర్కొన్నారు. లీకులు ఎక్కడి నుండి వస్తున్నాయో మాకు సమాచారం ఉంది. లీకులు ఇచ్చే వారిపై అధిష్టానానికి పిర్యాదు చేస్తాం అన్నారు.

లీకులకు కారణం ముఖ్యమంత్రి కేసీఆరే అంటూ సంజ‌య్ వ్యాఖ్యానించారు. త‌న పార్టీలో ఏం జరుగుతుందో చూడకుండా పక్క పార్టీలో కుట్రలు చేయడం కేసీఆర్ కు అలవాటయింది అంటూ సంజ‌య్ విమ‌ర్శించారు. ఈటల రాజేందర్ హత్య చేస్తానన్న వారిని ముందుగా అరెస్టు చేయాలని సంజ‌య్ డిమాండ్ చేశారు. ఈటల ఇష్యూ పై కేటీఆర్ స్పందించాడు.. సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని సంజ‌య్‌ ప్ర‌శ్నించారు. హత్య చేస్తానన్న వ్యక్తి బహిరంగంగా ప్రెస్ మీట్‌లు ఎలా పెడతారు అంటూ బండి సంజ‌య్ విమ‌ర్శించారు. నాపై దాడులు జరిగాయి, రాజసింగ్ పై దాడులు జరిగాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ సంజ‌య్ ప్ర‌శ్నించారు.

Ravi Kishan Daughter: సైన్యంలో చేరిన ‘రేసుగుర్రం’ విలన్ కుమార్తె.. ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న నెటిజ‌న్లు