Site icon HashtagU Telugu

Atchannaidu: జర్నలిస్టుల భద్రతకు చర్యలు తీసుకుంటాం : అచ్చెన్నాయుడు

Atchannaidu

Atchannaidu

Atchannaidu: అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రౌడీ మూకలు బరితెగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈనాడు కంట్రిబ్యూటర్ రమేశ్‍ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన ఒక ప్రతిక ప్రకటనలో తెలిపారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అధికారం నుంచి దిగిపోయే వరకు వైసీపీ రౌడీ మూకలు ప్రజలు, మీడియాపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారని మండిపడ్డారు.

రమేష్ పై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై దాడులు చేసిన వారినే వదలే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. పోలింగ్ ముగిసిన సాయంత్రానికే జగన్ లండన్ పారిపోతాడని, జగన్ అండతో రెచ్చిపోతున్న వైసీపీ గూండాల పరిస్ధితి ఏంటో ఆలోచించుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు.  కూటమి అధికారంలోకి వచ్చాక జర్నలిస్టుల భద్రతకు చర్యలు తీసుకుంటామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  కింజరాపు అచ్చెన్నాయుడు