Prayagraj : భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం భూటాన్ రాజు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఆ తర్వాత గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని యోగీ ఆదిత్యనాథ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక, భూటాన్ రాజు వాంగ్‌చుక్ సోమవారమే లక్నో నగరానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు వాంగ్‌చుక్‌కు స్వాగతం పలికారు.
Read Also: Bunny : ‘గీత ఆర్ట్స్ ‘ నుండి బన్నీ బయటకు..? క్లారిటీ వచ్చేసినట్లేనా..?
ఇండియా-భూటాన్ మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ భూటాన్ రాజు మహాకుంభ్‌కు హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరుదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు గంగాహారతి, పూజా కార్యక్రమాల్లో పొల్గొన్నారు. దీనికి ముందు సోమవారంనాడు మహాకుంభ్‌లో పాల్గొనేందుకు భూటాన్ రాజు ప్రయాగ్‌రాజ్ చేరుకోవడంతో ఆయనను చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆయన క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ్ 2025 ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షించింది. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కోల్డ్‌ప్లే బ్యాండ్ ప్రధాన గాయకుడు క్రిస్ట్ మార్టిన్, తన స్నేహితురాలు, నటి డకోటా జాన్సన్‌తో కలిసి శనివారం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు.
Read Also: RCB Captain: ఐపీఎల్ 2025లో RCB కెప్టెన్సీని విరాట్ కోహ్లీ స్వీకరిస్తారా?