Site icon HashtagU Telugu

Britain: చిలుకను చంపివేసినందుకు 25 నెలలు జైలు శిక్ష

Britain

New Web Story Copy 2023 08 30t185223.821

Britain: చిలుక అంటే ఎవ్వరికైనా ఇష్టమే. ముద్దుముద్దు మాటలు పలికే చిలుకను ఎంతో మంది తమ ఇంట్లో పెంచుకుంటారు.కొందరు ఆ చిలకలతో జాతకాలు చెప్తూ బ్రతుకు సాగిస్తారు. మొత్తానికి చిలుక మానవ జీవితంలో ఎంతో ప్రత్యేకత చాటుకుంటుంది. అయితే ఆ చిలుకను చంపాలని ఎవరు అనుకుంటారు? కానీ బ్రిటన్ లో ఓ ఇద్దరు మహిళలు చిలుకను అతి కిరాతంగా చంపేశారు.

చిలుకను చంపినందుకు ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బ్రిటన్ లో చోటు చేసుకుంది. నికోలా బ్రాడ్లీ మరియు ట్రేసీ డిక్సన్ వీరిద్దరూ మద్యం సేవించి ఒక ఆడ ఆఫ్రికన్ గ్రే చిలుకను చంపారు. షాపింగ్ చేసి తిరిగి వచ్చేసరికి చిలుక చనిపోయి కనిపించిందని చిలుక యజమాని క్రూక్స్ పేర్కొన్నారు. జాతీయ గీతం మరియు టీవీ థీమ్ ట్యూన్‌లను పాడటంలో ఆ చిలుక ప్రసిద్ధి చెందిందని ఓనర్ క్రూక్స్ చెప్పారు. చిలుకను చంపేసి కుక్కకు వేసేందుకు ప్రయత్నించారని తెలిపాడు. ఈ మేరకు కోర్టులో విచారణ జరిపించి నిందితులు ఒక్కొక్కరికి 25 నెలల జైలు శిక్ష విధించారు. చిలుక పేరు స్పార్కీ అని ముద్దుగా పెట్టుకున్నాడు క్రూక్స్.

Also Read: Bhagwant Kesari: భగవంత్ కేసరి ఫస్ట్ సాంగ్ ప్రోమో.. బాలయ్య, శ్రీలీల మాస్ డాన్స్ అదుర్స్